శ్రీశైలం క్షేత్రానికి మంగళవారం అయోధ్య రామమందిరం నుంచి శ్రీరాముని అక్షింతలు చేరుకున్నాయి. ఈ పరమ పవిత్రమైన శ్రీరాముని అక్షింతలకు స్థానికలు మల్లికార్జునస్వామి, భ్రమరాంబికాదేవి ప్రధానాలయం ముందుభాగంలో గంగాధర మండపము వద్ద అక్షింతలకు ప్రత్యేక పూజాదికాలు జరిపించి, క్షేత్రపరిధిలో కోలాహలంగా ఊరేగింపు నిర్వహించారు. రేపటి నుంచి ఈ నెల 15 వరకు ఇంటింటికీ శ్రీరాముని అక్షింతలను పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా శ్రీరాముని అక్షింతలు దేశంలోని నలుమూలలకు పంపిస్తున్న తరుణంలో శ్రీశైలం క్షేత్రానికి కూడా చేరుకోవడంతో తాముకూడా శ్రీరాముని అక్షింతలు పొందుతున్నామని స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేపు ఉదయం పాతాళగంగ ఆంజనేయస్వామి ఆలయం నుండి అక్షింతలు పంపించేస్తామని తెలిపారు.
శ్రీశైలం చేరుకున్న అయోధ్య అక్షింతలు..
139
previous post