ప్రపంచ రికార్డు సృష్టించిన అయోధ్య దీపావళి

Ayodhya Diwali

Advertisements

&NewLine;<p>దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగును నింపి&comma; వేడుకల వాతావరణాన్ని పెంచే అతి పెద్ద పండుగ&period; అయితే&comma; ఈ పవిత్రమైన రోజును అయోధ్య నగరంలో ఒక్క రోజు ముందు జరుపుతారు&period; సరయూ నదీ తీరంలో వెలిగించే దీపాలు సరికొత్త ప్రపంచ రికార్డునూ సృష్టించాయి&period; రామమందిరం త్వరలోనే ప్రారంభం కానుండగా&period;&period; ఇప్పటి నుంచే సంబరాలు మొదలయ్యాయి&period; అయోధ్యలోని సరయూ నదీ ఒడ్డున గత ఏడేళ్లుగా దీపావళికి ముందు రోజు దీపోత్సవం నిర్వహిస్తున్న విషయం మనందరికి తెలిసిందే&period; సరయూ తీరంలోని 51 ఘాట్‌లలో 22 లక్షలకు పైగా దీపాలను వెలిగించారు&period; ఈ దీపోత్సవంలో 25 వేల మందికిపైగా పాల్గొని 22 లక్షలకుపైగా దీపాలను వెలిగించారు&period; అయితే&comma; గతేడాది 15&period;76 లక్షల దీపాలను వెలిగించగా ఈ ఏడాది ఆ రికార్డును బద్దలుకొట్టింది&period; కొత్త రికార్డును సృష్టించింది&period;ఈ కార్యక్రమానికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ ప్రతినిధుల బృందం హాజరై&period;&period; డ్రోన్‌ కెమెరాతో వెలిగించిన దీపాలను లెక్కించారు&period; ప్రపంచ రికార్డును ధ్రువీకరిస్తూ యూపీ ముఖ్యమంత్రికి గిన్నీస్ సర్టిఫికేట్‌ను అందించారు&period; రావణ సంహారం తర్వాత సీతాసమేతంగా అయోధ్యలో అడుగుపెట్టిన శ్రీరామునికి సోదరులు à°­à°°à°¤ శతృఘ్నులు స్వాగతం పలికిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే రథోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌&comma; గవర్నర్‌ అనందీబెన్‌ పటేల్‌ పాల్గొన్నారు&period; అనంతరం సరయూ తీరంలో యోగి ఆదిత్యనాథ్‌ సరయూ హారతి నిర్వహించి&comma; &OpenCurlyQuote;దీపోత్సవ్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.