వారంలో కనీసం మూడు కప్పుల బీన్స్ తినగలిగితే ఆరోగ్యానికి ఎంతో మేలు’ అంటున్నారు. బీన్స్‌లో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గుండె ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు పెరగకుండా చూస్తాయి. సన్నబడాలని డైటింగ్ చేసే వాళ్లూ బీన్స్‌ని తినేయొచ్చు. అరకప్పు బీన్స్‌లో ఏడు గ్రాముల ప్రొటీన్లు లభ్యమవుతాయి. అంటే ముప్ఫై గ్రాముల చికెన్, మటన్‌లో లభించే పోషకాలతో సమానం అన్నమాట. వీటిని కూరల్లోనే కాదు సూపులూ, ఇతర టిఫిన్ల తయారీలోనూ ఉపయోగించవచ్చు. బీ కాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లూ బీన్స్‌లో లభిస్తాయి. ఉడికించిన తరవాత కూడా వీటిలోని డెబ్భై శాతం పోషకాలు మిగిలే ఉంటాయి. కాలేయం, చర్మం, కళ్లు, వెంట్రుకలు లాంటి అనేక భాగాలకు వీటినుంచి శక్తి అందుతుంది.
బీన్స్‌తో గుండెకు మేలు
97
previous post