మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గుత్తి మున్సిపాలిటీ కార్మికుల ఆధ్వర్యంలో రోడ్డుపై భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. గత పది రోజులుగా మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని జగన్ సర్కార్ పై మున్సిపాలిటీ కార్మికులు మండిపడ్డారు. మున్సిపాలిటీ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని, కరోనా కాలంలో చనిపోయిన కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ కార్మికుల సంఘం నాయకులతో చర్చలు జరిపి తక్షణమే తమ సమస్యల పరిష్కరించాలని లేనిపక్షంలో రాబోవు కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు ఈ సందర్భంగా జగన్ సర్కారుకు హెచ్చరించారు.
మున్సిపాలిటీ కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన..
82
previous post