86
దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘75వ గణతంత్ర దినోత్సవ ప్రత్యేక సందర్భంలో శుభాకాంక్షలు. జై హింద్!’’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇక ఇమాన్యుయేల్ మాక్రాన్ కూడా భారత పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నా ప్రియ నేస్త నరేంద్ర మోదీ, భారతీయ ప్రజలకు మీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ వద్దే ఉన్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. వేడుకలు జరుపుకుందాం!’’ అంటూ ట్వీట్ చేశారు.