భద్రాచలం దేవస్థానం మరియు పట్టణ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది.

Advertisements

<p>భద్రాచలం దేవస్థానం మరియు పట్టణ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది&period; దేవాదాయ శాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ&comma; భద్రాచలం పునరాభివృద్ధి–పునరుజ్జీవన కార్యక్రమాల కోసం మొదటి దశలో భాగంగా రూ&period;351 కోట్ల పరిపాలనా అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది&period; ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ఉత్తర్వులు జారీచేశారు&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఏడాది భద్రాచలం పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ నిర్ణయం వెలువడటం విశేషం&period; ఈ ప్రక్రియలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ నిరంతర పర్యవేక్షణ&comma; కృషి కీలక పాత్ర పోషించాయి&period; ఆమె తీసుకున్న ప్రత్యేక చొరవతో ప్రతిపాదనలు వేగంగా ఆమోదం పొందగా&comma; ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్నిలబెట్టుకుంది&period; మొదటి దశలో గోదావరి ఘాట్ విస్తరణ&comma; ఆధునిక వసతులతో అభివృద్ధి&comma; ఆలయ సముదాయం విస్తరణ&comma; పరిసర ప్రాంతాల సదుపాయాల మెరుగుదల వంటి ప్రధాన పనులు చేపట్టనున్నారు&period; ఇందుకోసం గోదావరి ఘాట్‌కు రూ&period;75 కోట్లు&comma; ఆలయ సముదాయానికి రూ&period;180 కోట్లు&comma; పరిసర అభివృద్ధికి రూ&period;96 కోట్లు కేటాయించారు&period;<&sol;p>&NewLine;<p>మొత్తం మూడు దశల్లో అమలు కానున్న ఈ ప్రాజెక్టులో రెండో దశలో కాపా రామలక్ష్మమ్మ భూమిలో రూపాంతరాత్మక అభివృద్ధి&comma; మూడో దశలో భద్రాచలం పట్టణ సమగ్ర అభివృద్ధి చేపట్టనున్నారు&period; మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ&period;586 కోట్లుగా అంచనా వేయబడింది&period; అగమ శాస్త్రాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టబడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది&period; పనుల అమలును రోడ్లు -భవనాల శాఖకు అప్పగిస్తూ&comma; నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించింది&period; ఈ ఉత్తర్వుల పట్ల మంత్రి కొండా సురేఖ సంతోషం వ్యక్తంచేశారు&period;&period; తమ ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని&comma;భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం&comma; భద్రాచలం క్షేత్ర వైభవాన్ని మరింత అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు&period; ఈ ప్రాజెక్టుతో పర్యాటక రంగానికి కొత్త ఊపు లభించడంతో పాటు&comma; స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా బలం చేకూరుతుందని తెలిపారు&period; ఈ నిర్ణయం భద్రాచలం అభివృద్ధి చరిత్రలో కీలక మలుపుగా నిలుస్తూ&comma; ప్రాంతానికి నిజమైన మహర్దశకు నాంది పలుకుతోంది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..