రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని చేవెళ్ల మండలంలో పలు గ్రామాలలో ధర్మసాగర్, కమ్మెట, గొల్లగూడ, గొల్లపల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన కాంగ్రెస్ అభ్యర్థి బీమ్ భరత్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ వచ్చే ఎలక్షన్లో చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీం భారత్ ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినా పథకాలైన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటికి ఒక ఉద్యోగం, సాగునీరు, రోడ్లు ఇవన్నీ ఈ కార్యక్రమాలను అమలు చేయలేదు కాబట్టి ఎలక్షన్లో వాళ్లకు ఓటు అడిగే హక్కు లేదని వాళ్లు మన గ్రామంలోకి వచ్చిన బయట నుంచే పంపేయాల్సిందిగా ఆయన కోరారు అలాగే వచ్చే ఎలక్షన్లలో బి ఆర్ ఎస్ పార్టీని ఓడించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పలు గ్రామాలలో ప్రచారాన్ని నిర్వహించిన భీమ్ భరత్
73
previous post