చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ..
ఏపీలో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తున్నారు. చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఈ రేపు సాయంత్రం 4 గంటలకు ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. మూడు పార్టీలు ఏర్పాటు చేసిన ఈ సభకు ‘ప్రజాగళం’ అని నామకరణం చేశారు. తాజాగా ఈ సభ లోగోను విడుదల చేశారు. మధ్యలో ప్రధాని మోదీ, ఆయనకు ఇరువైపులా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉన్నారు. ప్రజాగళం సభ ద్వారా మోదీ, చంద్రబాబు, పవన్ ఒకే వేదికపైకి రానున్నారు. సభకు లక్షలాది మంది వస్తారన్న అంచనాల నేపథ్యంలో వంద ఎకరాలకు పైగా సభ ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలో 13 కమిటీలు ఈ సభా నిర్వహణలో పాలుపంచుకుంటున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: వాలంటీర్లపై జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి కీలక ఆదేశాలు..!
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి