వైసీపీలో సీట్ల మార్పుతో నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే కొందరు నేతలు పక్కచూపులు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు రాదని భావిస్తున్న నేతలు టీడీపీతో టచ్ లోకి వెళ్తున్నారు. ఇదే దారిలో కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధ చేసుకున్నాడు. ఆ దిశగా చర్చలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో చంటిబాబు టీడీపీ తరుపున జగ్గంపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యరు, 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ గా పనిచేసిన చంటిబాబు ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని వైసీపీ హైకమాండ్ తేల్చి చెప్పడంతో చంటిబాబు అయోమయంలో పడ్డారు. జగ్గంపేట ఎమ్మెల్యేగా ఉంటే తానుండాలి లేదంటే తన కుటుంబానికి చెందిన వారు ఉండాలని గానీ బయటి వారికి ఎలా మద్దతు ఇస్తామని అనుచరులతో చెబుతున్నారు. అయితే చంటిబాబుకు జగ్గంపేట ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేమని టీడీపీ కూడా తేల్చి చెప్పింది. తనకు వేరేచోట నుంచి పోటీ చేసే అవకాశమం ఇవ్వాలని కోరుతున్నారు. వచ్చే నెల 5, 6 తేదీల్లో చంటిబాబు పసుపు పార్టీ కండువా కప్పుకునే అవకాశముంది.
వైసీపీకి బిగ్ షాక్..!
104
previous post