అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం,
వైసీపీకీ బిగ్ షాక్ | Big shock for YCP…
వైసిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన గోపనపల్లి(Gopanapally) గ్రామస్తులు. కండువా కప్పి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించిన మండిపల్లి. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అందరూ కృషి చేయాలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు. శుక్రవారం రోజు రాయచోటి మదనపల్లి రోడ్ లోని పిసిఆర్ ఫంక్షన్ హాల్ లో ఉన్న రాయచోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని గాలివీడు మండలం గోపనపల్లికి చెందిన గ్రామస్తులు ఆయనను కలిసి పలు విషయాలపై చర్చించారు. తర్వాత పలు కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి ఆయన కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(Mandipalli Ramprasad Reddy) మాట్లాడుతూ…
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలలో శ్రీకాంత్ రెడ్డి రాయచోటికి చేసింది ఏమీ లేదన్నారు ఇసుక, లిక్కర్ దోపిడీల ద్వారా వారి ఆస్తులను పెంచుకున్నారన్నారు. ప్రజలను అడుగడుగున ఇబ్బందులు పెట్టారన్నారు. రాబోయే ఎలక్షన్ లో కష్టపడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే ప్రజా సమస్యల తీరుతాయని రాష్ట్ర అభివృద్ధి చెందడంతో పాటు రాయచోటి కూడా అభివృద్ధి చెందుతుందని దీనికోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ డీలర్ మిట్టపల్లి వెంకటరమణారెడ్డి, కానాల వీరారెడ్డి నల్లబత్తిని పార్వతీ రెడ్డి, శీలం మురళీమోహన్ నాయుడు, నల్లబత్తిని ఇరుగుల్ రెడ్డి, కృష్ణయ్య, గాలివీటి భాస్కర గాలివీటి వెంకటేశులు, లక్కం జయరామప్ప నాయుడు, శీలం కిరణ్ కుమార్ నాయుడు, శీలం నితిన్ కుమార్ నాయుడు, రాజుపాలెం రామానుజులు, కొండా వెంకటనారాయణ, మిట్టపల్లి లక్ష్మిరెడ్డి,చింతం రెడ్డి గారి కోటిరెడ్డి, షేక్ ఇబ్రహీం, షేక్ ఫక్రుద్దీన్, షేక్ బికారి,షేక్ ఖాదరవల్లి, రాజుపాలెం అచ్చన్న, తంగేడు కుంట యోగాంజనేయులు, శివపురం గురునాథరెడ్డి, నల్లబత్తిని చిన్నపరెడ్డి, మిట్టపల్లి రెడ్డి, మిట్టపల్లి చిన్న గంగిరెడ్డి, మిట్టపల్లి కృష్ణారెడ్డి, మిట్టపల్లి భాస్కర్ రెడ్డి, సూర్య ప్రకాశ్ రెడ్డి, షేక్ ఖాదరవల్లి, గోపన్న జయచంద్ర నాయుడు,గోపున నరసింహనాయుడు, గోపన శివప్ప నాయుడు, గోపన రెడ్డప్ప నాయుడు, గోపన కుమార్ నాయుడు, గోపన్న చిన్నారెడ్డి, అప్పన్న నాయుడ, పేయల నరసింహప్ప నాయుడు, పేయల చలపతి నాయుడు,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: టీడీపీలో చేరిన వైసీపీ నేతలు…