అతి కిరాతకంగా వృద్ధ మహిళను కత్తితో పొడిచి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నెల్లూరు జిల్లా కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని చుట్టుగుంట గ్రామానికి చెందిన మందలపు శేషమ్మ (70) మహిళను ఆమె ఇంట్లో అతి కిరాతకంగా హత్య చేశారు. శేషమ్మ భర్త చాలా కాలం క్రితం మరణించగా ఆమె ఒంటరిగా ఇంటివద్ద ఉంటున్నది. శేషమ్మకు ఒక కుమారుడు, ఒక కుమార్తె, ఇద్దరికీ పెళ్లిళ్లు కాగా కొడుకు కెనడాలో, కుమార్తె హైదరాబాద్ లో ఉంటున్నారు. జనవరి 1 వతేది అందరితో మాట్లాడిన శేషమ్మ 2వతేది ఉదయం నుండి ఎవరికీ కనిపించలేదు. బంధువులు ఫోన్ చేసిన సమాధానం లేదు. దీంతో శేషమ్మ తమ్ముడు పక్కింటి వారికి ఫోన్ చేసి సమాచారం అడుగగా, వారు ఇంటి వద్దకు వెళ్లగా బయట తాళం వేసి ఉండటం, లోపలి నుండి దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తాళాలు పగలగొట్టి చూడగా బెడ్ రూములో రక్తపు మడుగులో చనిపోయి దుర్వాసన వస్తున్న మృతదేహం పడి ఉంది. కత్తితో గొంతు భాగంలో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. కందుకూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టుమ్ కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.
మహిళ దారుణ హత్య..
156
previous post