మహిళ దారుణ హత్య..

murder

Advertisements

&NewLine;<p>అతి కిరాతకంగా వృద్ధ మహిళను కత్తితో పొడిచి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది&period; నెల్లూరు జిల్లా కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని చుట్టుగుంట గ్రామానికి చెందిన మందలపు శేషమ్మ &lpar;70&rpar; మహిళను ఆమె ఇంట్లో అతి కిరాతకంగా హత్య చేశారు&period; శేషమ్మ భర్త చాలా కాలం క్రితం మరణించగా ఆమె ఒంటరిగా ఇంటివద్ద ఉంటున్నది&period; శేషమ్మకు ఒక కుమారుడు&comma; ఒక కుమార్తె&comma; ఇద్దరికీ పెళ్లిళ్లు కాగా కొడుకు కెనడాలో&comma; కుమార్తె హైదరాబాద్ లో ఉంటున్నారు&period; జనవరి 1 వతేది అందరితో మాట్లాడిన శేషమ్మ 2వతేది ఉదయం నుండి ఎవరికీ కనిపించలేదు&period; బంధువులు ఫోన్ చేసిన సమాధానం లేదు&period; దీంతో శేషమ్మ తమ్ముడు పక్కింటి వారికి ఫోన్ చేసి సమాచారం అడుగగా&comma; వారు ఇంటి వద్దకు వెళ్లగా బయట తాళం వేసి ఉండటం&comma; లోపలి నుండి దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించారు&period; పోలీసులు తాళాలు పగలగొట్టి చూడగా బెడ్ రూములో రక్తపు మడుగులో చనిపోయి దుర్వాసన వస్తున్న మృతదేహం పడి ఉంది&period; కత్తితో గొంతు భాగంలో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు&period; క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు&period; కందుకూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period; మృతదేహాన్ని పోస్టుమార్టుమ్ కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..