అదృశ్యమైన వృద్ధురాలి దారుణ హత్య…

Nagamma

Advertisements

&NewLine;<p>సంక్రాంతి పండుగకు కుమార్తె వద్దకు వెళ్తూ అదృశ్యమైన వృద్ధురాలు దారుణహత్యకు గురైన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది&period; పోలీసులు&comma; గ్రామస్థుల కథనం ప్రకారం కల్వకుర్తి మండలం తర్నికల్‌కి చెందిన నాగమ్మ&lpar;60&rpar;కు ముగ్గురు కుమారులు&comma; కుమార్తె ఉన్నారు&period; ప్రస్తుతం కొడుకుల వద్ద ఉంటున్న ఆమె సంక్రాంతి కావడంతో వంగూరు మండలం ఉల్పరలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు మంగళవారం కల్వకుర్తి వచ్చారు&period; బస్సు కోసం బస్టాండులో వేచి ఉండగా గుర్తు తెలియని వ్యక్తి మాయమాటలు చెప్పి వెంట తీసుకెళ్లాడు&period; నాగమ్మ రాత్రయినా కుమార్తె ఇంటికి చేరుకోపోవడంతో మరుసటి రోజు అంతా వెతికినా ఫలితం లేకపోయింది&period; కుటుంబ సభ్యులు బుధవారం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు&period; అందులో నిక్షిప్తమైన దృశ్యాలతో నిందితున్ని గుర్తించినట్లు సమాచారం&period; అనుమానితున్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించనట్లు తెలిసింది&period; హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు&comma; వెండి ఆభరణాలను అపహరించాడు&period; అచ్చంపేట సమీపంలో నల్లమల అడవుల్లో మృతదేహాన్ని పడేసి గుర్తుపట్టకుండా నిప్పటించాడు&period; పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహానికి అచ్చంపేట ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు&period; ఇలాంటి మరో కేసులో నిందితునిపై అనుమానాలు ఉండటంతో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.