మెదక్ హైవేపై కాలిబూడిదైన ప్రైవేట్ బస్సు..

Advertisements

<p>మెదక్ జిల్లాలో NH 44పై ఘోర అగ్నిప్రమాదం జరిగిది&period; మాసాయిపేట వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి&comma; క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైంది&period; డ్రైవర్&comma; క్లీనర్ అప్రమత్తంగా వ్యవహరించి బయటకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది&period; ఈ బస్సులో సాంకేతిక సమస్య తలెత్తడంతో మరమ్మతుల కోసం హైదరాబాద్ నుంచి మెదక్‌కు తీసుకొచ్చారు&period; రిపేర్ పూర్తయ్యాక డ్రైవర్&comma; క్లీనర్‌తో కలిసి హైదరాబాద్‌కు తిరుగు పయనమైంది&period; మాసాయిపేట వద్దకు రాగానే ఇంజిన్ భాగం నుంచి పొగ&comma; మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్‌&period;&period; వెంటనే బస్సును నిలిపివేసి&comma; క్లీనర్‌ను అప్రమత్తం చేశాడు&period; ఇద్దరూ కిందకు దూకేసి&comma; ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు&period; ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు&period; అయితే&comma; అప్పటికే బస్సు పూర్తిగా కాలి బూడిదైంది&period; ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది&period; ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు&comma; మరమ్మతుల సమయంలో జరిగిన లోపమా&quest; లేక షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా&quest; అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..