CM Jagan : వైఎస్సార్ కళ్యాణమస్తు వైఎస్సార్ షాదీ తోఫా ఐదో విడత నిధుల్ని సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. పేద కుటుంబాలు అప్పుల పాలు కావొద్దని అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రొత్సహించే క్రమంలోనే వీటిని అందిస్తున్నట్లు జగన్ తెలిపారు. అర్హులైన 10 వేల 132 జంటలకు 78 కోట్ల 53 లక్షల రూపాయల సాయం అందిస్తున్నామన్నారు. వధూవరులకు పదవ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరిగా చేశామని వధువు కనీస వయసు 18 ఏళ్లు, వరునికి 21 ఏళ్లుగా నిర్దేశించామని జగన్ తెలిపారు. వయసు పరిమితి పెట్టడం వల్లే బాల్యవివాహాలు తగ్గడంతోపాటు పేద పిల్లల చదువుల్ని ప్రొత్సహించినట్లు అవుతుందని జగన్ అన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.