చైనాలో మళ్లీ కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

Cases again in China

Advertisements

&NewLine;<p>చైనాలో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి&period; ఉత్తర చైనాలో కోవిడ్ తొలిరోజుల్లో ఉన్న దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి&period; చాలా స్కూళ్లలో చిన్నపిల్లల్లో నిమోనియా తరహా లక్షణాలు బయటపడుతున్నాయి&period; అంతేగాక ఈ వ్యాధి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది&period; ఈ నేపథ్యంలో భారత ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలు&comma; కేంద్ర పాలిత ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది&period; ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది&comma; పీపీఈ కిట్లు&comma; వెంటిలేటర్లు&comma; టెస్టింగ్ కిట్లు రీ ఏజెంట్స్ ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయనే దానిపై సమీక్షించుకోవాలని రాష్ట్రాలను కోరింది&period; ఈ వసతులన్నీ సరిపడేలా ఉండేలా చూసుకోవాలని కోరింది&period; ఇవేగాక ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది&period; ఇన్ ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది&period; చిన్నారుల్లో తలెత్తే శ్వాస సంబంధిత వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు నమోదయ్యే కేసుల డేటా ఎప్పటికప్పుడు జిల్లా&comma; స్టేట్ సర్విలెన్స్ యూనిట్లలో అప్ లోడ్ చేయాలని ఆరోగ్యశాఖ సూచించింది&period; డేటా కరెక్ట్ గా ఉంటే పరిస్థితిని పక్కాగా పర్యవేక్షించడానికి వీలవుతుందని తెలిపింది&period; కోవిడ్ మహమ్మారితో ఇప్పటికీ దేశంలో ఎక్కడో ఒకచోట బాధపడుతున్న చైనా తాజాగా నమోదవుతోన్న ఎనీమాటిక్ నిమోనియా కేసులతో బెంబేలెత్తుతోంది&period; స్కూలు పిల్లల్లో నమోదవుతోన్న ఈ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి&period; అయితే ఈ నుమోనియా కేసులకు ఎలాంటి కొత్త వైరస్ కారణం కాదని చైనా హెల్త్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది&period; అయినా ఈ కేసులపై మరింత సమాచారం అందజేయాలని WHO చైనా ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.