అక్రమ మైనింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. అయితే ఆయనను సాక్షిగా మాత్రమే సీబీఐ విచారణకు పిలిచింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ ఈ నోటీసులను జారీ చేసిందని, అఖిలేశ్ యాదవ్‌ను గురువారం ఢిల్లీలో ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమైందని నివేదికలు పేర్కొన్నాయి. 2012-2016 మధ్య హమీర్‌పూర్‌లో జరిగిన అక్రమ మైనింగ్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఇండియా టుడే నివేదిక ప్రకారం, నేరపూరిత కుట్ర, దొంగతనం, దోపిడీ, మోసం, నేరం వంటి నేరాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2012-2016 మధ్య కాలంలో హమీర్‌పూర్‌లో అక్రమ మైనింగ్‌కు అనుమతించిన పలువురు అధికారులతో పాటు 11 మందిని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్ల జారీ…
101