103
పీఎం కిసాన్ పథకం కింద 16వ విడత నిధులను రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేయనుంది. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా 2 వేల రూపాయల చొప్పున నగదును జమ చేస్తారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి 6 వేలు ఇస్తోంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు వాయిదాల్లో 2 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 15 విడతలు అకౌంట్లలో డబ్బు జమ చేయగా నేడు 16వ విడత నిధులను కేంద్ర జమ చేయనుంది.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.