క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మినీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ మేరకు గురువారం నారా చంద్రబాబు నాయుడు , ఆయన సతీమణి నారా భువనేశ్వరిలు విజయవాడ గుణదలలో ఉన్న మేరీమాతను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు దంపతులు పాల్గొని ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. చంద్రబాబు దంపతులతో పాటు వర్ల రామయ్య, దేవినేని ఉమా మహేశ్వర రావు, జవహర్, అశోక్ బాబు, నాగుల్ మీరా, కొల్లు రవీంద్ర తదితరులు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అంతకు ముందు విశాఖ నుంచి ఆయన విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం వద్ద చంద్రబాబుకు టిడిపి నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి మేరీమాత ఆలయానికి వెళ్లారు.
Read Also..
Read Also..