64
టీడీపీ అధినేత చంద్రబాబు కేసులు వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. నేడు ఢిల్లీలో సిద్ధార్థ్ లూథ్రా తనయుడి వివాహం జరగనుంది. ఎల్లుండి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ పెళ్లి రిసెప్షన్ కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి కూడా ఈ వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు. చంద్రబాబు ఈ నెల 28 వరకు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. కాగా, ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో, చంద్రబాబు త్వరలోనే మళ్లీ ప్రజల్లోకి రానున్నారని తెలుస్తోంది.