అడవిలో చిరుత పులి మృత్యువాత..

cheetah Died

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగుడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల అటవీ క్షేత్రంలో చిరుత పులి అనుమానస్పద రీతిలో మృత్యు వాత పడింది&period; గత ఐదారు మూడు రోజుల క్రితమే చిరుత మృత్యువాత పడ్డట్టు ప్రాథమిక అంచనాగా అటవి అధికారులు గుర్తిస్తున్నారు&period; అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు&period; చిరుత పులి మృతికి కారణాలను పరిశీలిస్తున్నారు&period; పెద్ద ఎల్కిచర్ల పెద్దడవి 654 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది&period; ఈ అడవిలో క్రూర మృగాలు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు&period; అయితే గొర్ల కాపరులకు చిరుత మరణించిన విషయం తెలుసుకొని గ్రామంలో ఈ సమాచారాన్ని చెప్పారు&period; దీంతో సమాచారం అందుకున్న అటవి శాఖ సిబ్బంది ప్రస్తుతం సంఘటనా స్థలాన్ని సందర్శించి సంఘటనపై వివరాలు సేకరిస్తున్నారు&period; చిరుత పులి పోస్టుమార్టం అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నారు&period; ఆ తర్వాత మీడియాకు జరిగిన సంఘటనపై వివరాలు తెలిపే అవకాశం ఉంది&period; ఇదిలా ఉండగా క్రూరమృగాలు సంచరిస్తున్న ఈ అటవీ చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని&comma; అటవీశాఖ అధికారులు చిరుతపులులు జనావాసాల్లోకి రాకుండా ప్రత్యేక ఏర్పాటు చేయాలని కోరుతున్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..