చిలుకూరి బాలాజీ దేవాలయం

Chilukuri Balaji Temple

Advertisements

&NewLine;<p>కొత్తగా హైదరాబాద్ వచ్చిన వాళ్లందరూ చూడాలనుకునే ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ టెంపుల్&period; తెలంగాణ తిరుమలగా ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుని మనసులో స్వామివారిని కోరికలు కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం&period; అందుకే ప్రతి రోజూ వేలాది మంది చిలుకూరు దర్శనానికి వస్తుంటారు&period; ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు&period; సెలవు రోజులైతే ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తారు&period; అయితే ఎందుకు ఇంత మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు&quest; ఈ ఆలయం చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<br><strong>ఆలయం చరిత్ర&colon;<&sol;strong><br>చిలుకూరి బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది&period; తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి పరమభక్తుడైన గున్నాల మాధవరెడ్డి చిలుకూరులో ఉండేవారు&period; ఆయన ప్రతి సంవత్సరం ఎంత కష్టమైనా కానీ కాలినడకన తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకునేవారు&period; వయసు పైబడినాగానీ కాలినడకన వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మాత్రం ఆపలేదు&period; అలా ఒకసారి మాధవరెడ్డి తిరుమలకు కాలినడకన వెళ్తుండగా మార్గం మధ్యలో అలసిపోయి సొమ్మసిల్లి పడిపోయారు&period; ఆ మగత నిద్రలో వచ్చిన కలలో మాధవరెడ్డికి స్వామివారు ప్రత్యక్షమయ్యారు&period; మాధవా ఇకపై నువ్వు నా దర్శనం కోసం ఇంతదూరం ప్రయాసపడి కాలినడకన రావాల్సిన అవసరం లేదు&period; నేను చిలుకూరిలోని ఒక పుట్టలో కొలువై ఉన్నా&period; వెలికి తీసి గుడి నిర్మించమని చెప్పి మాయమయ్యాడట&period; నిద్ర నుంచి మేలుకున్న మాధవరెడ్డి చిలుకూరు చేరుకుని ఇదే విషయాన్ని గ్రామస్థులకు చెప్పాడు&period; దీంతో అందరూ కలిసి పుట్ట వద్దకు వచ్చి గునపాలతో పెకిలించారు&period; అయితే పుట్టలో ఉన్న బాలాజీ విగ్రహం ఎదభాగంలో గునపం తగిలి రక్తం వచ్చింది&period; అలా దొరికిన బాలాజీకి గ్రామస్తులు అక్కడే ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు&period; ఆలయంలో కొలువైన బాలాజీ విగ్రహం ఎదభాగంలో గునపం గుచ్చుకున్న ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి&period; అయితే చిలుకూరి బాలాజీ దేవాలయంలో 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం.

కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.