అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న చైనాకు ఎదురుదెబ్బ..

Advertisements

<p>అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న చైనాకు ఎదురుదెబ్బ తగిలింది&period; దేశంలోని ప్రైవేట్ అంతరిక్ష సంస్థ &OpenCurlyQuote;స్పేస్ పయనీర్’ చేపట్టిన ప్రతిష్ఠాత్మక &OpenCurlyQuote;తియాన్‌లాంగ్-3’ రాకెట్ ప్రయోగం విఫలమైంది&period; రాకెట్ నింగిలోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలింది&period; స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన &OpenCurlyQuote;ఫాల్కన్ 9’ రాకెట్‌కు పోటీగా తియాన్‌లాంగ్-3ని రూపొందించారు&period; భారీ పేలోడ్‌లను మోసుకెళ్తూ&comma; తిరిగి భూమిపైకి వచ్చి ల్యాండ్ అయ్యే పునర్వినియోగ టెక్నాలజీతో దీనిని తయారుచేశారు&period; ఐతే రాకెట్‌ను ప్రయోగించిన కొన్ని నిమిషాలకే ప్రయోగం విఫలమై&period;&period; నిర్దేశిత కక్ష్యను చేరుకోలేకపోయింది&period; రాకెట్ మొదటి దశ విడిపోయే క్రమంలో&period;&period;ఇంజిన్ పనితీరులో తలెత్తిన సమస్యతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ వైఫల్యంపై స్పేస్ పయనీర్ సంస్థ విచారం వ్యక్తం చేసింది&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;తొలి ప్రయత్నంలో ఆశించిన ఫలితం రాకపోవడం బాధాకరమని&period; ఈ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని&comma; తదుపరి మిషన్లను మరింత పటిష్ఠంగా నిర్వహిస్తామని ప్రకటించింది&period; ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అంతరిక్ష ప్రయోగాల మార్కెట్‌లో పట్టు సాధించాలని చైనా గట్టిగా ప్రయత్నిస్తోంది&period; ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తోంది&period; ఈ నేపథ్యంలో తియాన్‌లాంగ్-3 వైఫల్యం &period;&period;చైనా ప్రైవేట్ అంతరిక్ష కార్యక్రమాలకు తాత్కాలిక అవరోధంగా నిలిచింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.

అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.

శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.