దళారుల మోసాలకు చెక్ పెట్టేందుకు టీటీడీ మాస్టర్ ప్లాన్..

Advertisements

<p>కలియుగ వైకుంఠం తిరుమలలో దళారుల ఆటకట్టించేందుకు టీటీడీ నడుం బిగించింది&period; ఆధార్ కార్డులను మార్ఫింగ్ చేస్తూ&period;&period; సామాన్య భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న అక్రమార్కుల గుట్టు రట్టు చేసేందుకు హైటెక్ అస్త్రాన్ని సిద్ధం చేసింది&period; ఇకపై కేవలం కార్డు చూపిస్తే సరిపోదు&period;&period; మీ ముఖం&comma; మీ వేలిముద్ర కూడా ఆధార్ డేటాతో మ్యాచ్ కావాల్సిందే&period;ఇందుకోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సేవలను టీటీడీ వినియోగించుకోనుంది&period; ఇప్పటికే ఇరు విభాగాల మధ్య చర్చలు సఫలమయ్యాయి&period; టీటీడీని &&num;8216&semi;అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ&&num;8217&semi;గా రిజిస్ట్రేషన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది&period; రెండేళ్ల కాలానికి గాను రూ&period;20 లక్షల రుసుము చెల్లించేందుకు టీటీడీ సిద్ధమైంది&period;&&num;8221&semi;<&sol;p>&NewLine;<p>ఈ కొత్త విధానంలో ఆధార్ నిర్ధారణతో పాటు ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థ కీలకం కానుంది&period; ఒకరు తీసుకున్న టికెట్‌పై మరొకరు వెళ్లే ఛాన్స్ లేకుండా టెక్నాలజీ నిఘా పెడుతుంది&period; ప్రతి ఈ-కేవైసీ లావాదేవీకి కొంత మొత్తాన్ని ఉడాయికి చెల్లిస్తూ&period;&period; పక్కాగా భక్తుల వివరాలను సరిపోల్చనున్నారు అధికారులు&period; అయితే ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి రావాలంటే ఏపీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక నోటిఫికేషన్ రావాల్సి ఉంది&period; కేంద్ర నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో&period;&period; ఇప్పటికే టీటీడీ సంప్రదింపులు మొదలుపెట్టింది&period; మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>శ్రీవారి దర్శనాలు&comma; ఆర్జిత సేవలు&comma; గదుల కేటాయింపులో పారదర్శకత పెంచడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం&period; దళారులు&comma; మధ్యవర్తుల ప్రమేయం లేకుండా&period;&period; సామాన్య భక్తులు నేరుగా సేవలు పొందేలా ఈ వ్యవస్థ దోహదపడనుంది&period; ఈ విప్లవాత్మక మార్పుతో తిరుమలలో దళారుల దందాకు శాశ్వతంగా అడ్డుకట్ట పడనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..