దక్షిణ కాశీ గా పిలువబడే శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో ఘనంగా చొక్కాని మహోత్సవం నిర్వహించారు. ముందుగా అలంకార మండపం లో స్వామి అమ్మవార్లకు విశేషంగా పూజలు నిర్వహించి వేదమంత్రాల మంగళ వాయిద్యాల నడుమ వేదపండితులతో కార్తీక దీపాలను చొక్కాని జరుగు ప్రదేశానికి తీసుకు వచ్చి అక్కడ గణపతి పూజ నిర్వహించి ధూప దీప నైవేద్యాలతో హారతి పట్టారు. అనంతరం కార్తీకదీపం తో చొక్కానిని వేద పండితులు వెలిగించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి దేవాలయ కార్యనిర్వహణ అధికారి KS రామారావు , ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూర శ్రీనివాసులు మరియు ఆలయ అధికారులు అలాగే వేలాదిగా మంది భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. శివనామ స్మరణల మధ్య చొక్కాని మహోత్సవం ఓం నమశ్శివాయ అంటూ ఆలయ ప్రాంగణం మారుమోగింది.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో చొక్కాని మహోత్సవం..
82
previous post