శ్రీకాళహస్తి లో ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో వచ్చు ఏడు గంగల జాతర అత్యంత వైభవంగా నిర్వహించనున్న సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానం నుండి స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ ఈఓ KS రామారావు ఇతర అధికారులు మరియు ఆలయ బోర్డు సభ్యులు పాల్గొని ముందుగా శ్రీకాళహస్తి దేవస్థానం లో అలంకార మండపం వద్ద ఏడు గంగమ్మలకు సారెను వుంచి ధూప దీప నైవేద్యాలు సమర్పించి వేదమంత్రాలు నడుమున సారి ను తీసుకొని నాలుగు మాడా వీధులలో ఊరేగింపుగా వచ్చి శ్రీకాళహస్తి ఏడు గంగమ్మ గుడి వద్దకు సారెను తెచ్చి ఏడు వీధులలో జాతరను జరిపించే నిర్వాహకులకు అందజేశారు.
srikalahasthi temple
శ్రీకాళహస్తి స్వామి వారి సేవలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. శ్రీకాళహస్తి స్వామి అమ్మ వారిని సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవాళ్ళ తీర్థప్రసాదాలు చిత్రపటం అందజేశారు..
దక్షిణ కాశీ గా పిలువబడే శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో ఘనంగా చొక్కాని మహోత్సవం నిర్వహించారు. ముందుగా అలంకార మండపం లో స్వామి అమ్మవార్లకు విశేషంగా పూజలు నిర్వహించి వేదమంత్రాల మంగళ వాయిద్యాల నడుమ వేదపండితులతో కార్తీక దీపాలను చొక్కాని జరుగు ప్రదేశానికి తీసుకు వచ్చి అక్కడ గణపతి పూజ నిర్వహించి ధూప దీప నైవేద్యాలతో హారతి పట్టారు. అనంతరం కార్తీకదీపం తో చొక్కానిని వేద పండితులు వెలిగించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి దేవాలయ కార్యనిర్వహణ అధికారి KS రామారావు , ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూర శ్రీనివాసులు మరియు ఆలయ అధికారులు అలాగే వేలాదిగా మంది భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. శివనామ స్మరణల మధ్య చొక్కాని మహోత్సవం ఓం నమశ్శివాయ అంటూ ఆలయ ప్రాంగణం మారుమోగింది.
విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా ఉన్న కేఎస్ రామారావును బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తరుణంలో శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనామా సమేత ఈశ్వర స్వామి వారి దేవస్థానం ఈవోగా ఈ ఉదయం ఏడు గంటలకు దేవాలయం నందు గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద బాధ్యతలు చేపట్టినారు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు కేదారి గౌరీ వ్రతాన్ని ఆచరించిన ఆలయ వేద పండితులు ప్రతి సంవత్సరము దీపావళి మరుసటి రోజు వచ్చే కేదారి గౌరీవ్రతాన్ని శ్రీకాళహస్తీశ్వరాలయంలో పెద్ద ఎత్తున వ్రతము ఆచరించుకునే భక్తుల కోసం ఈ సంవత్సరం కూడా ఆలయ అధికారులు 500 రూపాయల రాహు కేతు మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వ్రతాన్ని ఆచరించడానికి శ్రీకాళహస్తిలోని ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వచ్చి వ్రతాన్ని ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో సాగర్ బాబు దంపతుల తో పాటు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు కుటుంబ సభ్యులు బోర్డు సభ్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు





Total views : 78238