మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ వంటి, ఏసుక్రీస్తు అమూల్య సందేశాలు ఎంతటి కర్కోటకులైనా సన్మార్గంలో నడిపిస్తాయిని, ప్రజలపై క్రీస్తు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మాజీ మంత్రి, నెల్లూరు నగర టీడీపీ ఇంచార్జ్ పొంగూరు నారాయణ ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నేడు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నగరంలోని సెయింట్ జోసెఫ్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
లోక రక్షకుడు యేసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని, ఆయన చూపిన ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే మానవ జీవితాలు సుఖశాంతులతో తప్పక వర్ధిల్లుతాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం క్రీస్తు సందేశం మేరకు బిషప్ ప్రకాశం నుంచి ప్రత్యేక ఆశీర్వాఛానం తీసుకున్నారు. నేడు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని క్రైస్తవ చర్చలలో విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబయి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
నెల్లూరు జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
71