68
పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురిసౌత్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగరమాత దేవాలయం లో క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ విచారణ గురువులు పామిశెట్టి జోసెఫ్ బాలసాగర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం దివ్యబలి పూజ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పశువులపాక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా విచారణ గురువులు జోసెఫ్ బాలసాగర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శణీయమన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా మన మధ్య జన్మించిన రోజే క్రిస్మస్ పర్వదినమని అన్నారు. క్రీస్తు సందేశాలను సమస్త మానవాళి ఆచరించాలని సూచించారు.