నెల్లూరు, కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పర్యటించనున్నారు…

Advertisements

<p>నెల్లూరు&comma; కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పర్యటించనున్నారు&period; ఓవైపు పేదల సేవలో&comma; మరోవైపు భగవంతుని సేవలో అన్నట్టుగా ఒకే రోజు రెండు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు&period; మొదట నెల్లూరు జిల్లా&comma; వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు అందించనున్నారు&period; ఈ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు నేరుగా ఒంటిమిట్టకు వెళ్లి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సంధర్భంగా సీతారాముల వారికి సతీసమేతంగా పట్టువస్త్రాలు&comma; తలంబ్రాలను సమర్పిస్తారు&period; ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు సీఎం చంద్రబాబు వింజమూరు చేరుకుంటారు&period; వింజమూరులోని ఉత్తర ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీని చేపడతారు&&num;8230&semi; లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు&period; అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పాతూరు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొంటారు&period; 02&period;15 గంటలకు ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు&comma; కార్యకర్తలతో సమావేశమవుతారు&period; ఈ కార్యక్రమాన్ని ముగించుకుని సాయంత్రం 04&period;25 గంటలకు ఒంటిమిట్టకు సీఎం చేరుకుంటారు&period; 06&period;15 గంటలకు కోదండ రామస్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు&period; 06&period;45 గంటలకు కళ్యాణవేదికలో నిర్వహించే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి వార్లకు పట్టువస్త్రాలు&comma; తలంబ్రాలను అందజేస్తారు&period; ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి భువనేశ్వరి పాల్గొంటారు&period; రాత్రికి ఒంటిమిట్టలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు బస చేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.