67
నీటి వృధా పై సమగ్ర స్థాయిలో విచారణ జరిపేందుకు చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. సాగునీటి సలహా మండల సమావేశానికి వచ్చే రైతుల పట్ల పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారంటూ దుయ్యబట్టారు. నియోజకవర్గంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు సైతం నిధుల లేమితో నిలిచిపోయాయన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి రైతులను ఆదుకోవాలన్నారు.
Read Also..
Read Also..