అక్రమ కేసులో జైలుకు వెళ్లిన ప్రొద్దుటూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డికి కండిషన్ బెయిల్ మంజూరు అయింది. వైసిపి కార్యకర్త బెనర్జీ పై జరిగిన దాడి కేసులో నమోదైన హత్యాయత్నం కేసుకు సంబంధించి ప్రవీణ్ కుమార్ రెడ్డిని మూడవ నిందితునిగా అరెస్టు చేశారు. ఈనెల 13న ప్రవీణ్ ను అతని నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి కడప కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం కడప కేంద్ర కారాగారం నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి విడుదలయ్యారు. ప్రవీణ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ నాయకులు,కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చెయ్యని నేరానికి అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారని తెలిపారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్న అక్రమాలను.. అవినీతిని.. అరాచకాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళుతున్నానని… నాపై హత్యాయత్నం కేసు బనాయించి జైలుకు పంపారని ఆయన అన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి నాకు సంబంధం లేనటువంటి కేసులో ఇరికించారని ప్రవీణ్ తెలిపారు. ఎమ్మెల్యే నాపై ఎన్ని కేసులు పెట్టించినా… ఆయన చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని… వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరులో టిడిపి జెండా ఎగరవేస్తామని ప్రవీణ్ స్పష్టం చేశారు
ప్రవీణ్ కుమార్ రెడ్డికి కండిషన్ బెయిల్ మంజూరు..
71
previous post