57
ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క వర్గం ప్రజలూ బాగుపడలేదని, ఆమె కాలంలో ఘోరమైన పరిస్థితులు ఉండేవని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించింద 400 మందిని కాల్చి చంపింది కూడా ఆమె హయాంలోనే అని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నీటిపై కూడా పన్ను విధిస్తే, తాము రద్దు చేశామని అన్నారు. సంజయ్ ని గెలిపిస్తే జగిత్యాల నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. కాంగ్రెస్ గెలిచేది లేదు. సచ్చేది లేదని దాని పని మటాష్ అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఈ పదేళ్లలో ఏం చేసిందో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని కోరారు.
Read Also..
Read Also..