మహిళలకు టికెట్లు జారీ చేసిన కండక్టర్

Conductor who issued tickets to women

Advertisements

&NewLine;<p>తెలంగాణలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం అమల్లో ఉండగా మహిళలకు టిక్కెట్లు జారీ చేసిన కండక్టర్ ఉదంతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే&period; నిజామాబాద్‌లో జరిగిన ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా వివరణ ఇచ్చారు&period; కండక్టర్ ఉద్దేశపూర్వకంగా మహిళలతో టిక్కెట్లు కొనిపించలేదని స్పష్టం చేశారు&period; నిజామాబాద్ నుంచి బోధన్ వెళుతున్న పల్లె వెలుగు బస్సులో నిజామాబాద్ టౌన్ బస్టాండ్ వద్ద ఆదివారం ఒక పురుషుడు&comma; ఇద్దరు మహిళలు ఎక్కారు&period; టిక్కెట్లు ఇవ్వమని పురుష ప్రయాణికుడు అడిగితే కండక్టర్ మూడు టిక్కెట్లను ఒక్కోటి రూ&period;30కి ఇచ్చారు&period; అయితే&comma; రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందని ప్రయాణికుడు చెప్పడంతో పొరపాటు జరిగిందని కండక్టర్ వివరించాడు&period; ముగ్గురూ పురుష ప్రయాణికులే అని అనుకుని 3 టిక్కెట్లు ఇచ్చానని వివరించాడు&period; ఆ తరువాత కండక్టర్ మహిళల రెండు టిక్కెట్ల డబ్బునూ వెనక్కు ఇచ్చేశాడు&period; అయితే&comma; ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది&period; కండక్టర్ ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తూ మహిళలకు టిక్కెట్లు జారీ చేశారన్న ప్రచారం జరిగింది&period;<br>ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెంటనే స్పందించారు&period; ఆరోపణలు ఎదుర్కొంటున్న కండక్టర్‌ను డిపో స్పేర్‌లో ఉంచి విచారణ చేపట్టారు&period; అనంతరం&comma; కండక్టర్ ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడలేదంటూ వివరణ ఇచ్చారు&period; మహాలక్ష్మి పేరిట ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఆర్టీసీ సిబ్బందికి అవగాహన కల్పించామన్నారు&period; ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్