వృద్ధాప్య భద్రతే కాంగ్రెస్ లక్ష్యం…

MLC Jeevan Reddy

Advertisements

&NewLine;<p>ముప్పై సంవత్సరాలకు పైగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన ఉద్యోగి విరమణ అనంతరం వృద్దాప్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని అందులో పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు&period; సోమవారం ఇందిరా భవన్లో తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2024 క్యాలెండర్ ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అవిష్కరించారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం వృధ్యాప్య భద్రత అవసరమన్నారు&period; ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకొని తప్పనిసరిగా పెన్షన్ అందజేయాలని కాంగ్రెస్ భావించి ఆ దిశగా కట్టుబడి ఉందన్నారు&period; అందులో బాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్&comma; ఛత్తీస్ ఘడ్&comma; హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసిందని జీవన్ రెడ్డి గుర్తుచేశారు&period; కార్పొరేట్ సంస్థల మేలుకోసమే సీపీఎస్ విధానం వచ్చిందని ఉద్యోగుల మేలుకోసం కాదన్నారు&period; ఉద్యోగ&comma; ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా పాత పెన్షన్ పునరుద్ధరణ తొందరలోనే చేస్తామని జీవన్ రెడ్డి తెలిపారు&period; సీపీఎస్ తో 19 ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్న రెండు లక్షల ఉద్యోగులకు కొత్త సంవత్సర కానుకగా పాత పెన్షన్ పునరుద్దరణకు కృషిచేస్తానని చెప్పిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధరి మహేష్&comma; జిల్లా కోశాధికారి గొల్లపల్లి మహేష్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ లు కృతజ్ఞతలు తెలిపారు&period; ఈ కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వీరబత్తిని శ్రీనివాస్&comma; సందుపట్ల రమేష్&comma; బండారి సతీష్&comma; కొణతం నగేష్&comma; కేశెట్టి నవీన్&comma; అనుమాండ్ల నరేందర్&comma; నాంపల్లి హరికృష్ణ&comma; కొత్త వంశీ&comma; గుండా శ్రావణ్&comma;భక్తుల రమేష్&comma; సిర్ర శ్రీనివాస్&comma; ఏగ్యారపు వెంకటేష్&comma; మహేందర్ అపెక్స్ హాస్పిటల్ యాజమాన్యం రమేష్&comma; రవి&comma; శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..