46
రాజన్న సిరిసిల్ల జిల్లా. వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ 14,581 మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీ అని, 2014లో మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని గత పదేళ్లుగా పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పు రాష్ట్రంగా మార్చిందనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తుందని, అలాగే వేములవాడ నియోజకవర్గంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిచేస్తానని, ఈసారి గెలుపు ప్రజల గెలుపుని, తన గెలుపును ప్రజలకు అంకితమిస్తున్నానని చెప్పారు. అనంతరం రిటర్నింగ్ అధికారి మధుసూదన్ ఆది శ్రీనివాస్ కు అందించారు.
Read Also..