ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పూర్తిగా విఫలమైందని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy). రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందన్నారు. హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ 44వ ఆవిర్భావ వేడుకల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. గొప్పగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేయించలేని రాహుల్ గాంధీ.. ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని ప్రశ్నించారు.
ఇది చదవండి: జగిత్యాల ఆర్టీసీ బస్టాండ్ లో మహిళ వద్ద నగలు చోరీ..
సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ.. పథకాల అమలుపై లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల దృష్టి ఇప్పుడు బీజేపీపై ఉందని.. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకే ఓటేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోసం మేనిఫెస్టోను ప్రకటించడం కాదని.. ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కిషన్ రెడ్డి హితవు పలికారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి