కుర్చీలాటలో పైచేయి సాధించిన కాంగ్రెస్‌…

Congress has got the upper hand in Himachal Pradesh

Advertisements

&NewLine;<p>హిమాచల్‌ప్రదేశ్‌ కుర్చీలాటలో కాంగ్రెస్‌ పైచేయి సాధించింది&period; నెంబర్‌ గేమ్‌లో బీజేపీ వ్యూహాలకు చెక్ పెట్టింది&period; రెబల్‌ ఎమ్మెల్యేల విషయంలో వ్యూహాత్మకంగా అడుగు వేసింది&period; రాజ్యసభ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా ఓటేసిన ఆరుగురు ఎమ్మెల్యేలను స్పీకర్‌ అనర్హులుగా ప్రకటించారు&period; దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 34కు చేరింది&period; అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలుండగా&period;&period; కాంగ్రెస్‌కు 40 మంది&comma; బీజేపీకి 25 మంది&comma; ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు&period; అయితే సీఎం సుఖ్వీందర్‌సింగ్ పట్ల అసంతృప్తితో ఉన్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహా ముగ్గురు స్వతంత్ర సభ్యులు బీజేపీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు&period; లేటెస్ట్‌గా అక్కడ జరిగిన రాజ్యసభ ఎన్నికలో కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ వేశారు&period; దీంతో అక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు&period; కాంగ్రెస్‌కు తగిన బలం ఉన్నా కూడా&period;&period; క్రాస్ ఓటింగ్ కారణంగా ఆ పార్టీ అభ్యర్థి మనూ సింఘ్వీ ఓటమిపాలయ్యారు&period; మరో వైపు హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో 15 మంది ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కలదీప్ సింగ్ సస్పెన్షన్ వేటు వేశారు&period; బీజేపీ సభ్యులు సభలో స్పీకర్‌ను అగౌరవపరిచేలా ప్రవర్తిస్తున్నారని&period;&period; సభ సజావుగా సాగాలంటే వారిపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరుతూ మంత్రి హర్షవర్ధన్ చౌహాన్ తీర్మానం ప్రవేశపెట్టారు&period; ఈ తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది&period; ఈ క్రమంలో ప్రభుత్వం బల నిరూపణ చేసుకునేందుకు సిద్ధమైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఫైర్.