81
తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సంతోషంగా ఉంది. ట్రెండ్స్ ను పరిశిస్తున్న ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక టీపీసీసీ తన అధికారిక ట్విటర్ లో ఆ సంతోషాన్ని పంచుకుంది. 71 సీట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ దొరల తెలంగాణ నుండి విముక్తిని కోరుకున్న తెలంగాణ ప్రజలు అంటూ కామెంట్ చేసింది. ఎక్స్ లో పోస్ట్ చేసిన కాసేపటికే వైరల్ అయింది. పోలింగ్ చివరి రోజు రాహుల్, ప్రియాంక ప్రచారం చేసిన ఫొటోను పోస్ట్ చేసింది. వెనక భారీ జనసందోహంతో రాహుల్ తన చెల్లితో కలిపి తీసుకున్న సెల్ఫీని ట్యాగ్ చేసింది. మొత్తానికి తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ లో ఆక్సిజన్ నింపారు.