Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Technology ఈ టిప్స్ పాటిస్తే ఆన్‌లైన్ స్కామ్స్ నుంచి మీ స్మార్ట్‌ఫోన్ సేఫ్..!

ఈ టిప్స్ పాటిస్తే ఆన్‌లైన్ స్కామ్స్ నుంచి మీ స్మార్ట్‌ఫోన్ సేఫ్..!

by Satya
Online scams

ఆన్‌లైన్ మోసాలు చాలావరకు మొబైల్ ఫోన్ల ద్వారా జరుగుతున్నాయి. దీంతో మీ డివైజ్‌ స్కామ్స్ బారిన పడకుండా ఉండాలంటే సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ స్కామ్స్ ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. జాబ్ ఆఫర్స్ , గిఫ్ట్ , లాటరీ పేరుతో అమాయకులను టార్గెట్ చేసుకుని లక్షల్లో దోచేస్తున్నారు మాయగాళ్లు. స్మార్ట్‌ఫోన్లకు లింక్ లేదా మెనేజ్ పంపుతూ జనాలను బురిడి కొట్టిస్తున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉండి లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు. మీ అకౌంట్లలోని సొమ్ము మీకు తెలియకుండానే మాయం అవుతుంది. ఆన్‌లైన్ స్కామ్స్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు పరిశీలిద్దాం. లేటెస్ట్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్ సైబర్ స్కామర్స్ సాధారణంగా వినియోగదారుల స్మా్ర్ట్‌ఫోన్ ఓఎస్‌ను ఉపయోగించి స్కామ్‌లకు పాల్పడుతుంటారు. ఇవి తరుచుగా CERT-In రూపంలో మిమ్మల్ని అలర్ట్ చేసేవిగా ఉండవచ్చు. లేదా ఒక నిర్దిష్ట యాప్‌లో సున్నితమైన డేటాను లీక్ చేసే విధంగా ఉండొచ్చు. అందుకే స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీంతో స్కామ్‌ల బారిన పడే రిస్క్ తగ్గుతుంది. యాప్‌లను సైతం తాజా వెర్షన్‌లకు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకండి. సైబర్ కేటుగాళ్లు స్పామ్, హానికరమైన లింక్‌లను ఎస్‌ఎంఎస్ రూపంలో తరచుగా పంపుతుంటారు. అవి లాభదాయకమైన ఆఫర్స్ రూపంలో ఉంటూ నమ్మదగినవిగా ఉంటాయి. లింక్‌లపై క్లిక్ చేయమని మిమ్మల్ని అడగవచ్చు. ఇలాంటి సమయంలోనే స్మార్ట్‌ఫోన్ యూజర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పదంగా ఉండే లింక్‌లను అసలు ఓపెన్ చేయకండి. ట్రూకాలర్ వంటి యాప్‌ని ఉపయోగించడం ద్వారా స్పామ్‌ని చాలావరకు ఫిల్టర్ చేయవచ్చు. సిమ్ కార్డ్‌ లాక్ చేయడం సైబర్ మోసగాళ్లు ఇటీవల సిమ్ స్వాప్ ఫ్రాడ్ వంటి స్కామ్‌లకు పాల్పడుతున్నారు. ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసి మీ వ్యక్తిగత వివరాలను సేకరించి, వాటి ద్వారా నకిలీ SIM కార్డ్‌ను సృష్టిస్తున్నారు. ఈ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ SIMను పాస్ వర్డ్ ద్వారా లాక్ చేయాలి. పాస్‌వర్డ్‌ను ఎవరికీ షేర్ చేయకూడదు. పాస్‌వర్డ్ మీకు మాత్రమే తెలిసినందునా మీరు మాత్రమే మీ SIMని మరొక డివైజ్ లో యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ స్కామర్ మీ డూప్లికేట్ సిమ్‌కి యాక్సెస్ పొందినప్పటికీ, వారు నెట్‌వర్క్ సేవలను యాక్సెస్ చేయలేరు. దీంతో మీరు స్కామ్ బారిన పడటానికి అవకాశం ఉండదు. వీపీఎన్ యాక్సెస్ మీరు ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు మీ ఫోన్‌లో డేటా అయిపోయి, పబ్లిక్ వైఫై ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడితే స్మార్ట్‌ఫోన్‌లో VPN యాక్సెస్ చేసుకోండి. ఇది స్కామ్ బారి నుంచి మీ ఫోన్‌ను రక్షిస్తుంది. విలువైన మీ డేటాను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. దీంతో మీ డేటా చోరి కాకుండా వీపీఎన్ కాపాడుతుంది. సెన్సిటివ్ డాక్యుమెంట్స్‌కు ప్రత్యేక ఫోల్డర్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ ఆధార్, బ్యాంకింగ్ సమాచారానికి సంబంధించిన డిజిటల్ కాపీని ఫోన్‌లో సేవ్ చేసుకుని ఉంటారు. అయితే సైబర్ అటాక్ చేసే వ్యక్తి డివైజ్‌ను హ్యాక్ చేస్తే, మీకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకే ముఖ్యమైన ఫైల్‌లను మీరు మాత్రమే యాక్సెస్ చేసేలా పాస్‌వర్డ్-ప్రొటెక్డ్ సెక్యూరిటీ ఫోల్డర్‌లో వాటిని స్టోర్ చేయాలి. పాస్‌వర్డ్‌ల కోసం పాస్‌వర్డ్ మేనేజర్‌లను ఉపయోగించుకుంటే మీ ఫోన్‌కు మరింత సెక్యూరిటీ లభిస్తుంది.

Advertisements

You may also like

Our Visitor

008616
Total views : 56958

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.