Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home International ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

by CVR NEWS

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్ సేవలు కాసేపు నిలిచిపోయాయి. అంతేకాకుండా ట్విట్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. యూట్యూబ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఔటేజ్ అని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై యూజర్స్ పలు సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలకు పైగా యూజర్లు తమ సమస్యను రిపోర్ట్ చేశారు. ఒక్క అమెరికాలోనే 2.4 నుంచి 3.2 లక్షల వరకు ఫిర్యాదులు వచ్చాయి. యూట్యూబ్ ఓపెన్ అవకుండా సమ్ తింగ్ వెంట్ రాంగ్ అనే ఎర్రర్ మెసేజ్ చూపించిందని తెలిపారు. యాప్, వెబ్‌సైట్ లోడ్ కాకపోవడం, వీడియోలు ప్లే అవకపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. సిస్టమ్ గ్లిచ్ కారణంగానే కాసేపు సేవలు నిలిచిపోయినట్లు యూట్యూబ్ ప్రకటించింది.

Advertisements

You may also like

Our Visitor

040988
Total views : 212586

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: