Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh డిప్యూటీ సీఎం పవన్ కాన్వాయ్ కు ప్రమాదం..

డిప్యూటీ సీఎం పవన్ కాన్వాయ్ కు ప్రమాదం..

by CVR NEWS

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం జరిగింది. విశాఖపట్నంలోని సిరిపురం నుండి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసింది. దీంతో వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీ కొట్టాయి. ఈ ఘటనలో వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ప్రమాద సమయంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌లో లేకపోవడం గమనార్హం. ఆయనను పికప్ చేసుకోవడానికి రాడిసన్ బ్లూ హోటల్‌కు కాన్వాయ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Advertisements

You may also like

Our Visitor

039078
Total views : 194211

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: