Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra Pradesh దక్షిణ కొరియాలో కొనసాగుతున్న లోకేష్ పర్యటన.

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న లోకేష్ పర్యటన.

by CVR NEWS
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న లోకేష్ పర్యటన

దక్షిణకొరియాలో మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన..ఆ దేశ రాజధాని వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ అండ్ ఎల్జీ ఓవర్సీస్ హోల్డింగ్ కంపెనీస్ హెడ్ యున్-జు కోహ్ తో భేటీ అయ్యారు. కాకినాడ పోర్టు సమీపంలో పాలీస్టైరిన్ తయారీ సముదాయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మూలపేటలో ప్రపంచ స్థాయి నాఫ్తా క్రాకర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. మూలపేటలో ఎస్ఏఎఫ్, బయో-ఇథనాల్ ఉత్పత్తిపై దృష్టి సారించి, జీవ ఇంధనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.ప్లాస్టిక్ రీసైక్లింగ్, పైరోలిసిస్ ప్లాంట్లను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం అందించిన తాజా ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారుఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ యున్-జు కోహ్.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040023
Total views : 203016

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: