Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Business దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.

by CVR NEWS

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో 80కి పైగా దేశాల నేతలు, 500 మందికి పైగా గ్లోబల్ ఏఐ నిపుణులు, సీఈఓలు, పరిశోధకులు పాల్గొన్నారు. సమ్మిళిత వృద్ధి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో కృత్రిమ మేధ పాత్రపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఫిబ్రవరి 20 వరకు ఐదు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగుతుంది. ఫిబ్రవరి 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేస్తారు. సమ్మిళిత, బాధ్యతాయుతమైన ఏఐపై భారత్ విజన్‌ను, ప్రపంచ దేశాల సహకారంపై ఆయన తన ప్రసంగంలో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సదస్సులో 20 దేశాల అధినేతలు, 60 మంది మంత్రులు, ఉప మంత్రులు పాల్గొంటున్నారు.

ఈ సదస్సులో భాగంగా నిర్వహిస్తున్న ‘ఏఐ ఫర్ ఆల్’, ‘ఏఐ బై హర్’, ‘యువ ఏఐ’ పేర్లతో మూడు గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఛాలెంజ్‌లకు 60 దేశాల నుంచి 4,650కి పైగా అప్లికేషన్లు రావడం, బాధ్యతాయుత ఏఐ ఆవిష్కరణలలో భారత్ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందనడానికి నిదర్శనంగా నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisements

You may also like

Our Visitor

040963
Total views : 212535

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: