రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమ్ భరత్ ఉదయం 6 గంటల నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించి రాత్రి 10 గంటల వరకు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఈరోజు చేవెళ్ల మండలంలోని కేసారం, దామరగిద్ద, ఖానాపూర్ గ్రామాలలో కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భీం భారత్ కు పెద్ద ఎత్తున ప్రజలు నీరాజనాలు పలుకుతూ హారతులు ఇస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పుతూ వచ్చే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చేస్తున్న భూదందాలు కానీ, కుటుంబ పాలన కొనసాగిస్తున్నాడని దళితులకు రావలసిన పదవులను సైతం తన కుటుంబమే పొందుతుందని దుయ్యబట్టారు. రంగులు మార్చే ఊసరవెల్లి లాగా కేఎస్ రత్నం కూడా పార్టీలు మారుస్తున్నారని ఆయన చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాంగానే పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని దామరగిద్దలో బస్ డిపోను ఏర్పాటు చేపిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి భీం భారత్ తో పాటు వ్యవహారాల ఇన్చార్జి చింపుల సత్యనారాయణ రెడ్డి చేవెళ్ల సర్పంచ్ శైలజ రెడ్డి, దేవర వెంకటరెడ్డి సున్నం వసంతం షాబాద్ దర్శన్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
చేవెళ్ల లో జోరుగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం..
90
previous post