57
రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో పాల్గొన్నారు. కేసీఆర్ సీఎం, రాజయ్య ఎమ్మెల్యే అయ్యాక ఆడబిడ్డలకు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితిపై మండిపడ్డారు. ఈ పదేళ్లలో వారు సరిగ్గా పాలన అందిస్తే, ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేదా? అన్నారు. కేసీఆర్ కేబినెట్లో మాదిగ సామాజిక వర్గానికి, మహిళలకు సరైన ప్రాధాన్యత లేదని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు మహిళా మంత్రులు ఉంటారన్నారు.