ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు చదువుల తల్లిగా భావించే కాకతీయ యూనివర్సిటీ లో అవినీతి రాజ్యం ఎళుతుంది. తాజాగా వరంగల్ కాకతీయ యూనివర్సిటీ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కిష్టయ్య 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, ఇతర రుసుముల స్వీకరణలో జరిగిన 3 కోట్ల కుంభకోణంపై ఏ ఆర్ కిష్టయ్య, ప్రిన్సిపాల్ బన్న అయిలయ్య పై కమిటీ విచారణ చేస్తున్న సయమంలోనే వీసీ రమేష్ కిష్టయ్య ను క్యాంపస్ కు మార్చారు. న్యాక్ కోసం కేటాయించిన 10 కోట్ల బిల్లుల్లో చేతి వాటం కోసమే కిష్టయ్యను క్యాంపస్ కు వీసీ బదిలీ చేయించారని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. యూనివర్సిటీ లో కీలకైన నాలుగు కార్యాలయాలకు కిష్టయ్య ను ఒక్కడినే అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా వీసీ నియమించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. న్యాక్ సందర్భంగా వర్సిటీలో రోడ్లు, హాస్టళ్లు, ఇతర బిల్డింగ్ ల కోసం రూ.10 కోట్ల కేటాయించారు. వీటిలో కమీషన్ల కోసమే బిల్డింగ్ డివిజన్, పబ్లికేషన్స్ సెల్, హాస్టల్ ఆఫీస్ తో పాటు యూనివర్సిటీ ఆడిట్ ఆఫీస్ కు కూడా కిష్టయ్య నే అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా నియమించారు. ఒక్క హాస్టల్ లోనే పాలు అమ్మే వ్యాపారి దగ్గరి నుంచి 50 వేలు లంచం తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఇంకా దీని వెనుక పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయనే అనుమానంతో ఏసీబీ విచారణ జరుపుతోంది.
తల్లిగా భావించే యూనివర్సిటీలో అవినీతి..
76
previous post