ప్రకాశం జిల్లా పుల్లల చెరువు లో పంచాయతీ కార్యదర్శి మూడావత్ బాలునాయక్ ఎంపీడీఓ కార్యాలయం లో హరినాయక్ అనే వ్యక్తి నుండి పది వేలు లంచం తీసుకుంటుండగా ఎసీబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో హరినాయక్ తండ్రి ధర్మానాయక్ పుల్లల చెరువు పంచాయతీ పరిధిలో వీధి లైట్లు వర్క్ చేసారు. ఇటీవల ఆయన చనిపోయారు. ఈ నేపథ్యంలో వీధి లైట్లకు సంబంధించిన రెండు లక్షల బిల్లులను చెల్లించేందుకు పంచాయతీ కార్యదర్శి బాలునాయక్ హరినాయక్ ను ఇరవై వేలు లంచం డిమాండ్ చేయ్యగా ముందుగా హరినాయక్ ఐదు వేలు చెల్లించాడు. ఆ తరువాత పంచాయతీ కార్యదర్శి బాలునాయక్ కు లంచం ఇవ్వడం ఇష్టం లేని హరినాయక్ ఒంగోలు లోని ఎసీబి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పుల్లల చెరువు లోని ఎంపీడీఓ కార్యాలయం లో హరినాయక్ నుండి పది వేలు లంచం తీసుకుంటున్న పంచాయతీ అధికారి బాలునాయక్ ను ఎసీబి డిఎస్పీ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. దీంతో బాలునాయక్ పై కేసు నమోదు చేసిన ఎసీబి అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Bribe
ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు చదువుల తల్లిగా భావించే కాకతీయ యూనివర్సిటీ లో అవినీతి రాజ్యం ఎళుతుంది. తాజాగా వరంగల్ కాకతీయ యూనివర్సిటీ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కిష్టయ్య 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, ఇతర రుసుముల స్వీకరణలో జరిగిన 3 కోట్ల కుంభకోణంపై ఏ ఆర్ కిష్టయ్య, ప్రిన్సిపాల్ బన్న అయిలయ్య పై కమిటీ విచారణ చేస్తున్న సయమంలోనే వీసీ రమేష్ కిష్టయ్య ను క్యాంపస్ కు మార్చారు. న్యాక్ కోసం కేటాయించిన 10 కోట్ల బిల్లుల్లో చేతి వాటం కోసమే కిష్టయ్యను క్యాంపస్ కు వీసీ బదిలీ చేయించారని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. యూనివర్సిటీ లో కీలకైన నాలుగు కార్యాలయాలకు కిష్టయ్య ను ఒక్కడినే అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా వీసీ నియమించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. న్యాక్ సందర్భంగా వర్సిటీలో రోడ్లు, హాస్టళ్లు, ఇతర బిల్డింగ్ ల కోసం రూ.10 కోట్ల కేటాయించారు. వీటిలో కమీషన్ల కోసమే బిల్డింగ్ డివిజన్, పబ్లికేషన్స్ సెల్, హాస్టల్ ఆఫీస్ తో పాటు యూనివర్సిటీ ఆడిట్ ఆఫీస్ కు కూడా కిష్టయ్య నే అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా నియమించారు. ఒక్క హాస్టల్ లోనే పాలు అమ్మే వ్యాపారి దగ్గరి నుంచి 50 వేలు లంచం తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఇంకా దీని వెనుక పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయనే అనుమానంతో ఏసీబీ విచారణ జరుపుతోంది.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమరాయణం పేట కు చెందిన బుద్ధ జయ ఆదినారాయణ అనే రైతు వద్ద నుంచి పని చేసేందుకు కిర్లంపూడి డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వో వై లక్ష్మీదేవి 23000 డిమాండ్ చేశారు. దీంతో ఆ రైతు ఏసీబీ ని ఆశ్రయించారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌజన్య నేతృత్వంలో పాలెం గ్రామంలో రైతు వద్ద నుండి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా దాడి చేసి డిప్యూటీ తహశీల్దార్, విఆర్ వో ను అదుపులోకి తీసుకున్నారు.





Total views : 62349