బయటపడ్డ ప్రముఖ గేమింగ్ సంస్థ గేమ్స్‌క్రాఫ్ట్ బాగోతం.

Advertisements

<p>మొబైల్‌లో వినోదం&period;&period; చేతిలో ఫోన్ ఉంటే చాలు నిమిషాల్లో డబ్బులు సంపాదించవచ్చు అంటూ ఊరించే ఆన్‌లైన్ గేమింగ్ ప్రకటనలు ఇప్పుడు కోకొల్లలు&period; కానీ&comma; ఆ ఆట వెనుక ఎంత పెద్ద ఉచ్చు ఉందో తెలిస్తే షాక్‌కు గురికావాల్సిందే&period;&period; ఎస్&period;&period; భారత ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్ రంగాన్ని కుదిపేస్తున్న అత్యంత భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది&period; ప్రముఖ ఆన్‌లైన్ గేమింగ్ సంస్థ గేమ్స్‌క్రాఫ్ట్&period;&period; దాని అనుబంధ సంస్థ రమ్మీటైమ్ పై ఈడీ అక్షరాలా 19 వేల 984 కోట్ల మేర ఆర్థిక అక్రమాలు&comma; మనీ లాండరింగ్ ఆరోపణలతో ప్రత్యేక కోర్టులో భారీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది&period; అసలు ఈ గేమింగ్ మోసం ఎలా సాగింది&period;&period;&quest; మనం ఆడుతున్న ఆన్‌లైన్ గేమ్‌లో మనకు ఎదురుగా ఆడుతున్నది నిజమైన మనిషా&quest; లేక కంపెనీ రంగంలోకి దించిన సాఫ్ట్‌వేర్ బాట్ ఆ&period;&period;&quest; కోట్ల మంది వినియోగదారులను ఎలా బురిడీ కొట్టించారు&period;&period;&quest;<&sol;p>&NewLine;<p>ఈ కుంభకోణం ఎంత పెద్దదో ఒక్కసారి పరిశీలిస్తే&&num;8230&semi; గేమ్స్‌క్రాఫ్ట్&comma; రమ్మీటైమ్ ప్లాట్‌ఫారమ్‌లకు దేశవ్యాప్తంగా సుమారు 3 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు ఈడీ గుర్తించింది&period; ముఖ్యంగా తెలుగురాష్ట్రాలైన తెలంగాణ&comma; ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడుకు చెందిన సామాన్య ప్రజలే ఈ మోసానికి ఎక్కువగా బలయ్యారు&period; కేవలం వినోదం పేరుతో మొదలైన ఈ ఆటలను&&num;8230&semi; భారీ క్యాష్‌బ్యాక్‌లు&comma; వెల్కమ్ బోనస్‌లు&comma; నిరంతరం వచ్చే నోటిఫికేషన్లతో కంపెనీ వ్యసనంగా మార్చేసింది&period; నిజమైన ప్రత్యర్థులతో పోటీపడుతున్నామని భావించిన యూజర్లను&&num;8230&semi; తెర వెనుక ఆటోమేటెడ్ బాట్స్ తో ఓడిస్తూ కోట్లాది రూపాయలను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు&period; ఈ అక్రమ సంపాదనను కార్పొరేట్ లావాదేవీలు&comma; షేర్ బైబ్యాక్‌లు&comma; విలాసవంతమైన ఫామ్‌హౌస్‌à°² రూపంలో మనీ లాండరింగ్ చేసినట్లు ఈడీ తేల్చింది&period;<&sol;p>&NewLine;<p>ఈ కేసుకు సంబంధించి సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్లు వికాస్ తనేజా&comma; పృథ్వీరాజ్ సింగ్&comma; దీపక్ సింగ్ అహ్లావత్‌లను నిందితులుగా చేర్చిన దర్యాప్తు సంస్థ&&num;8230&semi; ఇప్పటికే దాదాపు రూ&period; 2&comma;401 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది&period; అంతేకాదు 2026 మేలో వీరిని ఈడీ అరెస్ట్ చేసింది&period; అనంతరం కర్ణాటక హైకోర్టు అరెస్టును చెల్లదని పేర్కొన్నప్పటికీ&comma; చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి ఎలాంటి న్యాయ అడ్డంకి లేదని ఈడీ స్పష్టం చేసింది&period; అరెస్టుపై కొంత ఉపశమనం కల్పించినప్పటికీ&comma; ఈడీ మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటోంది&period; సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది&period; ఈ పరిణామం భారత ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్ రంగానికి ఒక బిగ్గెస్ట్ వేక్-అప్ కాల్‌గా మారింది&period; ఇకపై బాట్ల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని&comma; ఆల్గోరిథమ్‌à°² ఆడిట్ నిర్వహించాలని నిపుణులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు&period; మొబైల్ స్క్రీన్ల వెనుక సాగుతున్న ఈ ఆర్థిక దోపిడీపై రానున్న రోజుల్లో మరింత కఠిన చర్యలు ఉండే అవకాశం కనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.