బాసరలో అడవి పందుల అక్రమ రవాణా భగ్నం.

Advertisements

<p>నిర్మల్ జిల్లా బాసరలో అటవీ శాఖ అధికారులు భారీగా అడవి పందుల అక్రమ రవాణాను అడ్డుకున్నారు&period; గోదావరి నది వంతెన వద్ద నిర్వహించిన తనిఖీల్లో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 23 అడవి పందులను స్వాధీనం చేసుకున్నారు&period; మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి సిద్ధిపేటకు వీటిని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు&period; ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు&period; రవాణాకు ఉపయోగించిన బొలెరో వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు&period; పట్టుకున్న అడవి పందులను బైంసా రేంజ్ కార్యాలయానికి తరలించి పశువైద్యుల ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు&period; వాటి వయస్సు&comma; లింగాన్ని నిర్ధారించిన అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని వెల్లడించారు&period; ఒకవేళ ఏవైనా అడవి పందులు మృతి చెంది ఉంటే పంచనామా నిర్వహించి నిబంధనల ప్రకారం ఖననం చేస్తామని తెలిపారు&period; ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు బాసర ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శివ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.