విశాఖ మధురవాడలో భారీ చోరీ.

Advertisements

<p>విశాఖపట్నంలోని మధురవాడలో భారీ చోరీ కలకలం రేపింది&period; జంక్షన్‌లో ఉన్న రామ్మోహన్ నాయుడు జువెలరీ షాపును లక్ష్యంగా చేసుకున్న దొంగలు అత్యంత పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడ్డారు&period; షాపు వెనుక మార్కెట్ వైపు నుంచి గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు సుమారు 20 కిలోల వెండి ఆభరణాలు&comma; వరలక్ష్మి కాసులను అపహరించారు&period; ఆనవాళ్లు చిక్కకుండా ఉండేందుకు షాపులోని సీసీ కెమెరాలు&comma; డీవీఆర్‌ను కూడా వెంట తీసుకెళ్లడం గమనార్హం&period; అయితే ప్రధాన బంగారు ఆభరణాలు ప్రత్యేక లాకర్‌లో భద్రంగా ఉండటంతో అవి దొంగల చేతికి చిక్కలేదు&period; ఘటనపై కేసు నమోదు చేసిన పీఎం పాలెం పోలీసులు&comma; క్రైమ్ విభాగం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు&period; పక్కనే ఉన్న దుకాణాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.